Friday, September 6, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 61

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 61

పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందనొత్తి మే
లొదవజగత్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి
త్సదమలమూర్తినీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!నీవు బలినణచి దేవేంద్రునికి ముల్లోకాలనిచ్చుటకై వామనుడవై రెండుపాదాల భూమ్యాకాశములను మూడవడుగు అతడితలపై పెట్టితివికదా!

No comments:

Post a Comment