Showing posts with label Dhasharathi. Show all posts
Showing posts with label Dhasharathi. Show all posts

Monday, November 11, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 83

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 83

అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌
కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై
దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!


తాత్పర్యం:
స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 82

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 82

శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!


తాత్పర్యం:
శ్రీరఘువంశ తిలకుడు, పవిత్ర తులసీమాలలు ధరించినవాడు, శాంతి, ఓర్పు వంటి సుగుణాల కోవిదుడు, మూడు లోకాల వాసులు కొనియాడదగిన శౌర్యపరాక్రమాలను ఆభరణాలుగా గలవాడు, కబంధుడు వంటి ఎందరో రాక్షసులను హతమార్చినవాడు, ప్రజల పాపాలను ఉద్ధరించేవాడు, దయసాగరుడు.. ఆ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా.

Sunday, September 8, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 81

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 81

హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై
కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
శివపార్వతులకి,విభీషణునికి మంత్రమై,కరి,అహల్య,ద్రౌపదికి ఆర్తిహరించిచుట్టమైన నీదివ్యనామము నానాలుకపైఎప్పుడూ పలుకజేయి.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 80

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 80

పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ
ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు
ర్జాతికిబుణ్యమబ్బె గపిజాతిమహత్వమునొందె గావునన్
దాతవుయెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
 నీదయకన్నిజాతులవారూపాత్రులేకదా!రామా!రాతినహల్యగా మార్చావు.వైరితమ్ముని లంకారాజుచేశావు.గుహునికిపుణ్యము,కోతులకిమహిమిచ్చావు.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 79

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 79

తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ
చ్చరణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై
కరిభట ఘోటకాంబరని కాయములై విరజానదీ సము
త్తరణ మొనర్చు జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
చెట్లకుపూసి కాయలుగామారేపువ్వులు మీపాదాలను చేర్చిన భక్తులకు ధనధాన్యములు,సకలసంపదల నిచ్చును.విరజానదిని దాటించునుకదా!రామా!

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 78

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 78

డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ
దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే
చేసినపాపమా వినుతిచేసిన కావవు కావుమయ్యనీ
దాసులలోననేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!శబరినీకు దగ్గరిచుట్టమా?దయతోఏలావు.నీభక్తునికిభక్తుడా?గుహుడు.అతడికిిసేవా భాగ్యమిచ్చావు.నేనేంపాపంచేశాను?నీభక్తుణ్ణి.కాపాడు.గోపన్న

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 77

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 77

సిరులిడసీత బీడలెగజిమ్ముటకున్ హనుమంతు డార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్
కరుణదలిర్ప మానవులగావగపన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!సంపదలిచ్చుసీత,పీడలుబాపుహనుమ,దుఃఖములార్చు లక్ష్మన్న,పాపములార్పు నీరామనామము ఇవన్నీమానవులకునీవేర్పరిచిన రక్షణ కవచము.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 76

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 76

సిరిగలనాడు మైమరచిచిక్కిననాడు దలంచిపుణ్యముల్
పొరిబొరి సేయనైతినని పొక్కినగల్గునే గాలిచిచ్చుపై
గెరలినవేళ దప్పిగొని కీడ్పడువేళ జలంబులు గోరిత
త్తరమున ద్రవ్వినన్ గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!డబ్బున్నప్పుడు మంచిపనులుచెయ్యక తరవాత చెయ్యలేదనేడిచి లాభమేమి?మంటలంటుకున్నాక నుయ్యితవ్వినట్లు.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 75

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 75

పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర
స్ఫుట వటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం
తట గృపజూచితివికద దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
ఉక్కుస్థంభమునుండి భయంకర నృసింహరూపముతో వెలువడి హిరణ్యకశిపుని గోళ్ళతోచంపి అతడికొడుకు ప్రహ్లాదుని కాపాడితివి

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 74

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 74

దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నెకా
భావనసేయుచున్నతరి పాపములెల్ల మనోవికారదు
ర్భావితు చేయుచున్నవి కృపామతివై ననుగావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!తల్లి,తండ్రి,గురువు,దైవం,దాత,సఖుడునీవేఅనినమ్మిన నన్నుపాపములు నాచేచెడుచేయించుచున్నవికాపాడు.గోపన్న

Saturday, September 7, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 73

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 73

దీక్షవహించి నాకొలదిదీనుల నెందరిగాచితో జగ
ద్రక్షక తొల్లి యాద్రుపదరాజతనూజ తలచినంతనే
యక్షయమైన వల్వలిడితక్కట నామొరజిత్తగించి ప్ర
త్యక్షము గావదేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
రామా!ద్రౌపదిప్రార్ధించినంతనే చీరలు ఆక్షయముగానిచ్చి ఆదుకున్నావు.దీనులనెందరినో ఆదరించిననీవు నాకుదర్శన మీయవేమి?

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 72

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 72

తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా
యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ
కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకుబంటునంటి నా
తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
 రామా!తప్పులు చేసితిని,నీవేఇక నాదైవం,నిన్నుతప్ప ఇతరులను కొలువను.,నీదాసానుదాసులను సేవించెద.నన్నుకాపాడు.గోపన్న[రామదాసు].

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 71

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 71

నీలఘనాభమూర్తివగు నినుగనుంగొన కోరివేడినన్
జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కిన రామనామమే
మూలను దాచుకోగలవు ముక్తికిబ్రాపది పాపములకు
ద్దాలముగాదె మాయెడల దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
ఎంతవేడినా నీనీలమేఘశ్యామ రూపముచూపక దాగెదవు.పాపములపోగొట్టి ముక్తికి దారిచూపే ప్రఖ్యాతిగాంచిన రామనామమెందుదాచెదవు?

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 70

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 70

అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై
దండ యొసంగకున్నె తుద దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
గరుడవాహనా!దశరధ రామా!నిన్నునమ్మి కొలిచెడువారి పాపములు కొండలంతటివైననూకరిగి సుఖములందుటేకాక మోక్షముసిద్ధించును.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 69

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 69

దాసినచుట్టమా శబరి దానిదయామతి నేలినావునీ
దాసునిదాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు నే
జేసినపాపమా వినుతి చేసిన కావవు గావుమయ్యనీ
దాసులలోన నేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!శబరి నీదగ్గరిచుట్టమా?దానిపై దయజూపావు.నీదాసుడికిదాసుడా?గుహునాదరించావు.నేనేంపాపంచేశానయ్యా?ప్రార్ధిస్తేపలకవు.కావుమయ్యా!గోపన్న.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 68

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 68

అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస
ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా
ద్ద్విజ మిము బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
బ్రహ్మకు తండ్రివి,సనకాదులకు పరతత్వానివి,మునులకు పరదేవతవు.సూర్యవంశ రాజులలో మేటివి.నిన్నునుతింతును.గోపన్న

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 67

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 67

ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్
గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్
గప్పినవేళ మీస్మరణ గల్గునోగల్గదో నాటికిప్పుడే
తప్పకచేతుమీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
ప్రాణముకొరకు యమభటులొచ్చినప్పుడు.రోగముతో గొంతులోశ్లేష్మ మడ్డుకున్నప్పుడు,బంధువులున్నప్పుడు మీస్మరణకలుగదు ఇప్పుడేచేస్తాను

Friday, September 6, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 66

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 66

భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ


భావం:-
యుద్ధము చేయుటలో ఆరితేరిన భయంకరుడు, దుఃఖములో ఆర్తితో నున్న-వారిని అక్కున జేర్చుకునే ఆత్మబంధువు. బాణప్రయోగ విద్యయందును, భుజ బలము నందును రామునకు దీటైన దేవుడు మరియొకడు లేడు గాక లేడని మదగజము నెక్కి 'డాం డాం' అంటూ డప్పు కొట్టి ప్రపంచమంతటా చాటింపు వేస్తాను.దశరధ రామా! కరుణా సముద్రా!-ఇది దాశరధీ శతకం లోని పద్యం.కవి రామదాసుగా పేరుపొందిన గోపన్న.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 65

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 65

భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్
హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద
ధ్యానముచేయుచున్న బరదైవమరీచు లడంగకుండునే
దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రాక్షసాంతక రామా!సూర్యుడుదయించగానే చంద్ర,అగ్నితేజస్సులు వెలవెలపోయినట్లు నీపదధ్యానము చేసినయెడల ఇతరదేవతలకాంతు లణగిపోవును.గోపన్న.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 64

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 64

నేనొనరించు పాపములనేకములైనను నాదుజిహ్వకున్
బానకమయ్యె మీపరమపావన నామము దొంటిచిల్క రా
మాననుగావుమన్న తుదిమాటకు సద్గతిజెందె గావునన్
దాని ధరింప గోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
నేనెన్నిపాపములుచేసిననూ నీనామము జపించుట నాకుతియ్యగా నున్నది.రామచిలుక'రామా'అన్నంతనే మోక్షమొసంగితివి.నాకునుఇవ్వు.గోపన్న.