Thursday, September 5, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 55

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 55

కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం
బాతనిమేనసీతకరుడౌట దవానలుడెట్టివింత?మా
సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్
ధాతకుశక్యమాపొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
రామా!హనుమకి రాక్షసుల్నిగెలవడంసాధ్యమా?అతడితోకకి పెట్టిననిప్పు చల్లబడడం మాసీతపతివ్రతామహిమ,సేవకునిపై మీకరుణపొగడ బ్రహ్మకైన సాధ్యమా?

No comments:

Post a Comment