Wednesday, September 4, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 47

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 47

మామకపాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తులే
మేమనివ్రాతురో శమనుడేమివిధించునో కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ వినజొప్పడదింతకుమున్నె దీనచిం
తామణియెట్లు గాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
 నాపాపములగురించి చిత్రగుప్తుడేమి రాశాడో?యముడేశిక్ష విధిస్తాడో?యమభటులేమి చేస్తారో?వాటినుండీ నువ్వేకాపాడురామా!.గోపన్న.

No comments:

Post a Comment