దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 44
ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ
మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్
సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే
దాంతముగాదె నీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
భావం:-
రామా!శబరిపుణ్యమేమో ఆమెఇచ్చిన ఎంగిలిపండ్లనుతిన్నావు.ప్రేమతోఉడుతను గోళ్ళతోనిమిరి ఆనందింపజేశావు.కులాలలెక్కించక వేదాంతముచూపావు.

No comments:
Post a Comment