Tuesday, September 3, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 36

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 36

శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైననీపవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద చిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
రామా!రఘువంశమునకు చంద్రుడువంటివాడవైన నీపాదపద్మాలపై మధురమైన ఉత్పలము,చంపకముఅనెడిపద్యాలతోపూజచేసెదనుస్వీకరింపుము.గోపన్న

No comments:

Post a Comment