Sunday, September 1, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 29

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 29

వలదుపరాకు భక్తజనవత్సల నీచరితంబువమ్ముగా
వలదుపరాకు నీబిరుదు వజ్రమువంటిదిగాన కూరకే
వలదుపరాకు నాదురితవార్ధికి దెప్పవుగా మనంబులో
దలతుమెకా నిరంతరము దాశరధీ కరుణాపయోనిధీ


భావం:-
రామా! భక్తులను కాపాడే నీకు పరాకు వద్దు. నీ మంచి చరిత్రకి, నీ బిరుదుకి కీడు తెచ్చుకోవద్దు. నా పాపసముద్రము మీద నీవు తెప్పవు.

No comments:

Post a Comment