Sunday, September 1, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 34

కృష్ణ శతకం (Krishna Shathakam) - 34

నారాయణ పరమేశ్వర
 ధరాధర నీలదేహ దానవవైరీ
 క్షీరాబ్దిశయన యదుకుల
 వీరా ననుగావుకరుణ వెలయగ కృష్ణా!


భావం:-
 నారాయణా,పరమేశ్వరా,భూదేవిని ధరించినవాడా,నీలిరంగు దేహముకలవాడా,దుష్టులను శిక్షించువాడా, పాలసముద్రమందు పవళించువాడా,యదువంశవీరా నన్ను కరుణతో కాపాడు కృష్ణా!

No comments:

Post a Comment