Saturday, September 7, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 65

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 65

పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్
బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే
చలువకువచ్చి మేఘు డొకజాడను దావడగండ్ల రాల్చినన్
శిలలగు నోటువేగిరమె శీతలనీరము గాక భాస్కరా


భావం:-
మంచివాడు మంచేమాట్లాడతాడు.ఓసారికఠినంపలికినా తప్పుకాదు.మేఘాలుఒకసారి వడగళ్ళు కురిసినా చల్లనీరగును.

No comments:

Post a Comment