Showing posts with label BhaskaraShatakam. Show all posts
Showing posts with label BhaskaraShatakam. Show all posts

Thursday, November 14, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 86

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 86

ఉరుగుణవంతు డొడ్లుదన కొండపకారము సేయునప్పుడున్
బరహితమే యొనర్చు నొకపట్టుననైనను గీడుజేయగా
నెఱుగడు నిక్కమే కదయ దెట్లన గవ్వముబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా!!


తాత్పర్యం:
మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు చేయడంలో గొప్పతనం ఏమీ ఉండదని మన పెద్దలు అంటారు. మంచి చేసిన వారికి మంచి చేయడం మరింత గొప్ప మానవత్వం అనిపించుకొంటుంది. అలాగే, చెడు చేసిన వారికి ప్రతిగా చెడునే చేయకుండా, మంచి చేయడమే ఉత్తమ లక్షణం. ఇదే గుణవంతుని తత్వం కూడా. ఎలాగైతే, పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుందో అలా.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 85

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 85

ఊరక వచ్చు బాటుపడ కుండినవైన ఫలంబదృష్టమే
పారగగల్గువానికి బ్రయాసము నొందిన దేవదానవుల్
వారలటుడుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగాదె శృంగా
రపుబ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!


తాత్పర్యం:
అదృష్టవంతులకు ఇతరుల ప్రయాసలకు అతీతంగా మంచి ఫలితాలు లభిస్తుంటాయి. ఎదుటివారి కష్టనష్టాల ప్రభావం వీరిపై ఏ మాత్రం పడదు. అందుకే, అదృష్టవంతులకు ఎప్పుడూ నిశ్చింతే. ఎందుకంటే, అన్నీ మంచి ఫలితాలే కనుక. ఎలాగంటే, దేవదానవులు పాలకడలిని చిలుకుతూ కష్టపడుతుంటే, శ్రీమహావిష్ణువుకు లక్ష్మీదేవి లభించినట్లు.

Monday, November 11, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 84

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 84

తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా
చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై
గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై
బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!


తాత్పర్యం:
దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!

Friday, November 8, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 83

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 83

అదను దలంచికూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్
గదిపి పదార్థ మిత్తురటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ, బొదుగు మూలము గోసిన బాలుగల్గునే
పిదికిన గాక భూమిబశుబృందము నెవ్వరికైనా భాస్కరా!


తాత్పర్యం:
పాలిచ్చే గోవునైనా, శ్రమకోడ్చే పశువులనైనా మచ్చికతో ఆదరింపజేసుకోవాలి. కానీ, పాలకోసం పొదుగును కోయడం, పనుల కోసం హింసించడం మంచిదికాదు. పాలకుడు కూడా ప్రజల మనసును తెలుసుకొని పన్నులు విధించాలి. అలా కాకుండా దౌర్జన్యానికి దిగితే వారి మనసు గెలువలేరు. కనుక, దేనినైనా ప్రేమతోనే జయించాలి మరి.

Friday, September 13, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 82

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 82

భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర
జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!


తాత్పర్యం:
పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి.

Sunday, September 8, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 81

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 81

నేరిచి బుద్దిమంతు డతినీతి వివేకముదెల్పినం జెడం
గారణ మున్నవానికది కైకొనకూడదు నిక్కమే దురా
చారుడు రావణాసురు డసహ్యమునొందడె చేటుకాలముం
జేరువయైననాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా


భావం:-
దుష్టుడగు రావణుడు పోగాలము దాపరించి విభీషణుని మంచిమాటలు వినలేదు.చెడుకాలములో మంచిమాటలు చెవికెక్కవు.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 80

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 80

తాలిమితోడగూరిమి గ్రుతఘ్నున కెయ్యెడనుత్తమోత్తముల్
మేలొనరించినన్ గుణముమిక్కిలికీడగు బాముపిల్లకున్
బాలిడిపెంచినన్ విషము పాయగనేర్చునే దానికోరలన్
జాలగనంతకంత కొకచాయను హెచ్చునుగాక భాస్కరా


భావం:-
పాముపిల్లకు పాలుపోసి పెంచిన విషము పెరుగునుగాని తగ్గదు. అట్లే దుష్టునకు ఎంతమేలుచేసినా కీడే జరుగును.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 79

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 79

నుడువులనేర్చుచాలని మనుష్యుడెరుంగక తప్పనాడినం
గడుగృపతోజెలంగుదురు కానియదల్పరు తజ్ఞులెల్లద
ప్పడుగులువెట్టుచున్నడచు నప్పుడు బాలునిముద్దుచేయగా
దొడుగురురింతెకాని పడద్రోయుదురేఎవ్వరైన భాస్కరా


భావం:-
ఎవరైనపసివారి తప్పటడుగులు ప్రేమింతురు.అట్లేపండితులు మాటలనేర్పు లేనివారినిచూసి సంతసింతురు.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 78

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 78

తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో
బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా
నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్
దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా


భావం:-
గొప్పవారిబలము తెలియకకోపముతో ఎదిరించిన చెడుదురు.పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.భాస్కరశతకం

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 77

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 77

తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో
బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా
నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్
దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా


భావం:-
గొప్పవారిబలము తెలియకకోపముతో ఎదిరించిన చెడుదురు.పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.భాస్కరశతకం

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 76

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 76

పరహితమైన కార్యమతిభారము తోడిదియైన బూనుస
త్పు రుషుడు లోకముల్పొగడ బూర్వమునందొక రాలవర్షమున్
గురియగజొచ్చినన్ గదిసిగొబ్బున గోజనరాక్షణార్ధమై
గిరినొకకేలనెత్తెనట కృష్ణుడుఛత్రముభాతి భాస్కరా


భావం:-
మహాత్ములుపరులకు కష్టములోసాయపడుదురు.రాళ్ళవాననించి కృష్ణుడు కొండెత్తి గోవుల్ని.గోపకుల్ని కాపాడాడు.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 75

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 75

చక్కదలంపగా విధివశంబున నల్పుని చేతనైనదా
జిక్కియవస్థలంబొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్
మిక్కిలిసత్వ సంపదల మీరిన గంధగజంబు మావటీ
డెక్కియదల్చి కొట్టికుదియించిన నుండదెయోర్చి భాస్కరా


భావం:-
బలమైనఏనుగు మావటిమీదెక్కి అంకుశంతోపొడిచిఆదలించిన సహించును.అట్లేఎంతబలుడైనా విధివశమునఅల్పునిచే పీడింపబడును.

Saturday, September 7, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 74

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 74

తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా
చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై
కడుదెగజూచుగా మరుగగాగిన తైలము నీటిబొట్టుపై
బడునెడ నాక్షణంబెగసి భగ్గునమండకయున్నె భాస్కరా


భావం:-
మరుగుతున్ననూనెలో నీటిబొట్టుపడిన భగ్గునమంటలేచును.దుష్టునికి మంచిచెప్పిన అట్లేమండిపడును.దూరముండాలి.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 73

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 73

ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే
యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా
జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే
పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా


భావం:-
చీడపురుగు పెరుగుతున్నచెట్టునుపట్టితినునుగాని నీరుపోసిపెంచనట్లే దుర్జనుడు కీడుచేయునేగాని మేలుచేయడు

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 72

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 72

చదువది ఎంతగల్గిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా
చదువునిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చరెచ్చటం
బదునుగమంచికూర నలపాకము చేసిననైననందునిం
పొదవెడునుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా


భావం:-
కూరఎంత నలుడు,భీముడు చేసినట్లుచేసినా ఉప్పుపడకపోతే రుచిలేనట్లు ఎంతచదువు చదివినా రసస్పందనలేక మెప్పుదొరకదు.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 71

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 71

స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము
ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం
గొరతవహింపడయ్యెడ నకుంఠీత పూర్ణసుధాపయోధిలో
నరుగుచు గాకిరెట్టయిడినందున నేమికొఱంత భాస్కరా


భావం:-
పైనపోవుచూ కాకి పాలసముద్రములో రెట్టవేసినసంద్రము చెడనట్లే ధర్మపరుని మూర్ఖుడు నిందించిన కొరతుండదు.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 70

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 70

పట్టుగనిక్కుచున్ మదముబట్టి మహాత్ముల దూలనాడినన్
బట్టినకార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్ధదోషముల్
పుట్టు మహేశుగాదని కుబుద్ధినొనర్చిన యజ్ఞతంత్రముల్
ముట్టకపోయి దక్షునికి మోసమువచ్చెగదయ్య భాస్కరా


భావం:-
శివునిపిలవక దక్షుడుయజ్ఞముచేసి అగచాట్లుపొందెను.మహాత్ములను ఎదిరించితూలనాడిన అట్లేఅగును.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 69

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 69

గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో
బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా
ల్గట్టిన శూద్రకున్ భ్రమలగప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా
పట్టునగొంచు మఱ్ఱికడబ్రాణముదీసె గదయ్యభాస్కరా


భావం:-
శూద్రకుడనురాజు కాశీలోచావవలె ననిమోకాళ్ళు విరగ్గొట్టుకున్నాడు.కాళ్ళుంటే తిరిగి ఎక్కడికైనావెళ్ళ-బుద్ధి పుడుతుందని. ముక్తిపొందాలని అతడి ఆలోచన.అయితే విధి లిఖితం మరోలా వుంది.అక్కడి అధిపతి ఒకరు గుఱ్ఱమును కొని స్వారీ చేయుట చేతగాక ఎలాగాని బాధపడుతుంటే చూసిన ఈరాజు నన్ను గుఱ్ఱం మీదకి ఎక్కిస్తే నేను గుఱ్ఱాన్ని అదుపులోకి తేగలను.అంటే అతడెక్కించాడు.అదిఊరివెలపల చెట్టుకి గుద్ది చంపింది.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 68

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 68

ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం
దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా
వామకరంబుతోడ గడువం గుడిచేత నపానమార్గముం
దోమగవచ్చునే మిగులదోచని చేతగుగాక భాస్కరా


భావం:-
మనిషిఎడమచేతతినుట,కుడిచేత గుదముకడుగుటకూడనట్లే ప్రభువులునీచునికి గొప్ప అధికారము,గొప్పవారికి నీచపనిచ్చుటతగదు.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 67

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 67

బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై
జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదేగాలిభాస్కరా


భావం:-
బలముంటే బంధువులసాయముంటుంది లేకుంటేశత్రువులౌతారు. మంటల్నిగాలి మరింతపెంచుతుంది.కొంచెమైతే ఆర్పుతుంది.