Wednesday, September 4, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 43

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 43

సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం
దొరసిన నిటునీకు దగునోయనిచెప్పిన మాననేర్చుగా
బురదయొకించుకంత తముబొందినవేళల జిల్లవిత్తుపై
నొరసిన నిర్మలత్వముననుండవె నీరములెల్ల భాస్కరా


భావం:-
నీళ్ళుబురదగాఉంటే ఇండుప[చిల్ల]గింజ గంధంకలిపితే స్వచ్చమైనట్లు గుణవంతుడు చేసినతప్పు దిద్దుకుంటాడు.

No comments:

Post a Comment