Wednesday, September 4, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 44

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 44

సకలజనప్రియత్వము నిజంబుగగల్గిన పుణ్యశాలికొ
క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమెపాసిపోవుగా
యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువుతన్ను మ్రింగినం
డకటకమానియుండడె దృఢస్టితినెప్పటియట్ల భాస్కరా


భావం:-
చంద్రునికళకొంతసేపు రాహువువల్లతగ్గినా తిరిగికాంతినిపొందినట్లు సద్గుణుడు ఆపదొచ్చినా కోలుకుంటాడు.భాస్కరశతకం.

No comments:

Post a Comment