Tuesday, September 3, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 40

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 40

దానపరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదల్
పూనిన వేళ నొక్క సరిపోలును జీకునకర్థరాత్రి యం
దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !


భావం :-
దానం, పరోపకారం అనే గుణాలు మనస్సులో లేని అవివేకికి పేదరికం వచ్చినా, సంపదలు కలిగినా ఒకే లాగ ఉంటుంది. ఎలాగంటే గుడ్డివాడికి అర్థరాత్రి అయినా , పట్టపగలైనా ఒకటే కదా !(మార్పేమి ఉండదని భావం ) 

No comments:

Post a Comment