Tuesday, September 3, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 39

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 39

శ్రీగలభాగ్యశాలికడఁ  జేరగఁగ వత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగముచేసి రత్ననిలయం డనికాదె సమస్త వాహినుల్
సాగరుఁ జేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి భాస్కరా


తాత్పర్యము:-
మానవులెన్ని కష్టములు పడియైనను ధనవంతుని చెంతనే చేరెదరు.నదులెన్ని వంకలు దిరిగినా తుదకు రత్నములుగలవాడనియే కదా సముద్రుని చేరుట జరుగుతున్నది. 

No comments:

Post a Comment