భాస్కర శతకం (Bhaskara Shatakam) - 34
అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె
ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే
ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా
తాత్పర్యము:-
రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా!

No comments:
Post a Comment