Tuesday, September 3, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 35

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 35
.
అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో
మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే
యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా


తాత్పర్యము :-
ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో  గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును.

No comments:

Post a Comment