భాస్కర శతకం (Bhaskara Shatakam) - 33
అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే
కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం
గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా!
తాత్పర్యం :-
భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు.

No comments:
Post a Comment