భాస్కర శతకం (Bhaskara Shatakam) - 32
ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా
తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా
రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్
భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా
తాత్పర్యము :-
మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా?

No comments:
Post a Comment