భాస్కర శతకం (Bhaskara Shatakam) - 31
ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం
బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా
నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!
తాత్పర్యము:-
గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా?

No comments:
Post a Comment