Tuesday, September 3, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 28

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 28

ఎప్పు డదృష్టతామహిమ  యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా
నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్
దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!


తాత్పర్యము :-
పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును. 

No comments:

Post a Comment