Tuesday, September 3, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 29

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 29

ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా
చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా
జేరి చినింగిపోఁ  గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!


తాత్పర్యము :-
సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును?

No comments:

Post a Comment