Monday, September 2, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 112

వేమన శతకం (Vemana Shatakam) - 112

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోనిపోరు ఇతింత కాదయా
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
చెప్పులోపడినరాయి, చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలిలోదిగినముల్లు,ఇంటిలోమొదలైనపోరు చిన్నవేఅయినా భరించడంకష్టం.

No comments:

Post a Comment