Monday, September 2, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 43

కృష్ణ శతకం (Krishna Shathakam) - 43

పాణితలంబున వెన్నయు
వేణీ మూలంబునందు వెలయగ బింఛం
బాణీముత్యము ముక్కున
బాణువువై దాల్తు శేషశాయివి కృష్ణా


భావం:-
కృష్ణా! చేతిలో వెన్నముద్ద, జుట్టు ముడిలో నెమలి పింఛము, ముక్కునందు ముత్యమును నేర్పుతో ధరించి శేషునిమీద పవళించేనీవు ఏమీ ఎరుగని గొల్లపిల్ల వాడివలె తిరిగితివి కదా!-కృష్ణశతకము.

No comments:

Post a Comment