Monday, September 2, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 111

వేమన శతకం (Vemana Shatakam) - 111

నీళ్ళలోననోడ నిగిడితిన్నగ బ్రాకు
బైట మూరెడైన బ్రాకలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
ఓడనీళ్ళలో ఎంతదూరమైనా ప్రయాణిస్తుంది.బైటఒక్క మూరెడుదూరంకూడా కదలదు.అలాగేమనిషి ఎంతనేర్పుగలవాడైన కొత్తప్రాంతానికివెళ్తే పనికిరాడు.అంటున్నాడు వేమన.నేడు దేశాలే మారుతున్నారు.

No comments:

Post a Comment