Monday, September 2, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 21

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 21

భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా
వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా
నూరక వింటినెక్కిడగనోపడు కృష్ణుడులేమిభాస్కరా


భావం:-
అర్జనుడెంత గొప్ప విలుకాడైననూ క్రిష్ణనిర్యాణానంతరము కృష్ణుని భార్యలను బోయవారి నుండీ కాపాడలేకపోయెను. దైవబలం ముఖ్యం.

No comments:

Post a Comment