Thursday, August 29, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 22

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 22

నోచిన తల్లిదండ్రికి దనూభవుడొక్కడె చాలు మేటి చే
జాచనివాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు నో
రాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మేన్
దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:-
పూర్వజన్మ పుణ్యం కారణంగా... చేయి చాచి ఇతరులను ధనం కోరని కొడుకు ఒక్కడు కలిగితే చాలు. ఇతరులు సహాయం కోరితే లేదనకుండా దానం చేసేవాడు ఒక్కడు చాలు. నోరు తెరిచి నిజం మాత్రమే పలికేవాడు ఒక్కడు చాలు. యుద్ధంలో వెన్ను చూపని ధైర్యవంతుడు ఒక్కడు చాలు. అటువంటి కొడుకు మాత్రమే కొడుకు కాని, ఇతరులైన వారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు.

No comments:

Post a Comment