నరసింహ శతకం (Narasimha Shatakam) - 7
అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె,
సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె,
సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె,
దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె,
యితర కామంబు గోరక సతతముగను
భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె,
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
తాత్పర్యం:-
ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ!

No comments:
Post a Comment