శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 8
పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో
గ రహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్, శంక వో
దరయం గుమ్మడికాయలోని యవగింజంతైన, నమ్మించి, సు
స్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాహస్తీశ్వరా!
తాత్పర్యం:
మంత్రతంత్రాలన్నీ పరిశీలించాను. సాంఖ్యాది యోగ రహస్యాలను తెలుసుకొన్నాను. వేదశాస్ర్తాలను చదివాను. అయినా, నాలోని అనుమానాలు నివృత్తి కావడం లేదు. అవేవీ నా శంకలను తీర్చలేకున్నాయి. కాసింత నమ్మకమనే దీపాన్ని
నాలో వెలగించవా దేవా! తద్వారా సుస్థిరమైన జ్ఞానజ్యోతిని నాలో ప్రసరింపజేయుమా!

No comments:
Post a Comment