Thursday, August 29, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 21

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 21

సిరిగల నాడు మైమరచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్
పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలి చిచ్చుపై
గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ


భావం:-
దశరథ పుత్రుడవైన రామా, దయకు సముద్రము వంటివాడా! శరీరానికి ముసలితనం వచ్చిన తరవాత, ఇప్పటి వరకు పుణ్యమైన పనులను ఏమీచేయలేకపోయానే అని ఎంత బాధపడినప్పటికీ ప్రయోజనం ఉండదు. గాలి ఎక్కువగా వీస్తూ మంటమీద దాని ప్రభావం చూపించి, ఆ మంటను ఉవ్వెత్తున ఎగిసేలా చేస్తున్న వేసవికాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు దాహం తీర్చుకోవడం కోసం బావిని తవ్వటం మొదలుపెడితే లాభం ఉండదు. అందువలన ఓపికగా ఉన్న రోజులలోనే భగవంతుడి మీద భక్తితో పుణ్యకార్యాలను చేయాలి. (ముసలితనం రాక ముందే చేయాలి). లేకపోతే బాధపడవలసి వస్తుంది.

No comments:

Post a Comment