కుమార శతకం (Kumara Shatakam) - 7
సభ లోపల నవ్విన యెడ
సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ
కభయం బొసంగె నేనియు
బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!
తాత్పర్యం:-
సభ జరిగే వేళ నవ్వకూడదు. ఎందుకంటే,అది తప్పుడు అర్థానికి దారితీస్తుంది. అలా నవ్విన వారు ఎంతటి వారైనా సరే, సభికులతో చిన్నచూపుకు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది. అలాగే, రాజు నీకు అభయమిచ్చి రక్షించినప్పుడు నీ పట్ల తాను చూపిన ఆ కరుణను నమ్ముకొని నువు ఎంతమాత్రం గర్వపడకూడదు కుమారా!

No comments:
Post a Comment