Showing posts with label kumaraShatakam. Show all posts
Showing posts with label kumaraShatakam. Show all posts

Thursday, November 14, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 41

కుమార శతకం (Kumara Shatakam) - 41

ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయ బోకుము
కార్యా లోచనము లొందజేయకు
మాచారము విడువ బోకుమయ్య కుమారా!


తాత్పర్యం:
నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు.

Monday, November 11, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 40

కుమార శతకం (Kumara Shatakam) - 40

తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!


తాత్పర్యం:
పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు.

కుమార శతకం (Kumara Shatakam) - 39

కుమార శతకం (Kumara Shatakam) - 39

తమ్ములు తమయన్న యెడ భ
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!


తాత్పర్యం:
రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది.

Friday, November 8, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 38

కుమార శతకం (Kumara Shatakam) - 38

ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబు దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్న బడెడు మాడ్కి దిరుగు మెలమి కుమారా!


తాత్పర్యం:
ఎవరూ పుట్టుకతో సంపన్నులు కాలేరు. శ్రమతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి, ఇంట్లో సంపదలు ఉన్నా, లేకున్నా కుటుంబ రహస్యాలు బయటపెడుతూ, పరువు తీసే పనులు చేయరాదు. మనల్ని కన్నవారికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా, పదిమంది వారిని పొగిడేలానే మన ప్రవర్తనలు ఉండాలి సుమా.

Sunday, September 1, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 37

కుమార శతకం (Kumara Shatakam) - 37

పాపపు బని మది దలపకు
చేపట్టిన వారి విడువ జేయకు కీడున్
లోపల దలపకు, క్రూరుల
ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!


తాత్పర్యం:
పాపపు కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కనీసం మదిలోకూడా తలవకూడదు. మనపైనే ఆధారపడిన భార్యాబిడ్డలను ఎన్నడూ విడువరాదు. కాపాడుతానన్న వారిని వదిలి వేయవద్దు. మనసులో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు. అలాగే, దుర్మార్గులను ఎంతమాత్రం నమ్మరాదు. ఇలాంటి తగని పనులను తెలుసుకొని నడచుకోవాలి.

Friday, August 30, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 36

కుమార శతకం (Kumara Shatakam) - 36

పోషకుల మతముఁగనుఁగొని
భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్,
దోషముల నెంచుచుందురు,
దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు చుండుము. అప్పుడే వారు సంతోషింతురు. లేకున్న దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కల్గిన యెడల నీకు హాని కలుగును.

కుమార శతకం (Kumara Shatakam) - 35

కుమార శతకం (Kumara Shatakam) - 35

ధరణీనాయకు రాణియు
గురురాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుఁదలఁపుఁ కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! రాజు భార్యయును, గురు భార్యయును, అన్న భార్యయును, అత్తయును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.

కుమార శతకం (Kumara Shatakam) - 34

కుమార శతకం (Kumara Shatakam) - 34

పెద్దలు వద్దని చెప్పిన
పద్దులఁబోవంగరాదు పరకాంతల నే
ప్రొద్దే నెదఁబరికించుట
కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు.

కుమార శతకం (Kumara Shatakam) - 33

కుమార శతకం (Kumara Shatakam) - 33

వృద్ధజన సేవ చేసిన,
బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్
సద్ధర్మశాలి యని బుధు
లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! పెద్దలను భక్తితో కొలుచుచున్న యెడల వానిని లోకమునందు పరిశుద్ధముగల మనస్సు కలవాడనియు, తెలివి తేటలు బాగుగా నుండు వాడనియు, ధర్మములనెరిగిన వాడనియు పెద్దలగువారందురు.

కుమార శతకం (Kumara Shatakam) - 32

కుమార శతకం (Kumara Shatakam) - 32

అతి బాల్యములోనైనను,
బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స
ద్గతిమీఱ మెలఁగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.

కుమార శతకం (Kumara Shatakam) - 31

కుమార శతకం (Kumara Shatakam) - 31

ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్,
బ్రాజ్ఞతను గలిగి యున్నన్,
బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు.

కుమార శతకం (Kumara Shatakam) - 30

కుమార శతకం (Kumara Shatakam) - 30

శ్రీ భామినీ మనోహరు
సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్
లో భావించెద; నీకున్
వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! శ్రీ లక్ష్మీనాథుడును, సంపదయు, ప్రేమయు రూపంగా కల వాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడును సకల ఐశ్వర్యములను ఇచ్చునట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను.

కుమార శతకం (Kumara Shatakam) - 29

కుమార శతకం (Kumara Shatakam) - 29

అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రుని విద్య రానియతని సం
స్తవనీయు, దేవశృతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! వికలాంగుని, కురూపిగా ఉండువానిని, దానము లేని దరిద్రుడిని, విద్యరాని వానిని, గొప్పగుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు.

కుమార శతకం (Kumara Shatakam) - 28

కుమార శతకం (Kumara Shatakam) - 28

సద్గోష్ఠి సరియు నొసగును
సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! సజ్జనులతో సహవాసము, మాట్లాడుట సంపదలను కలిగించును. కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయతగినది.

Thursday, August 29, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 27

కుమార శతకం (Kumara Shatakam) - 27

తనుజులనుం గురువృద్ధుల
జననీజనకులను సాధుజనుల నెవడు దా
ఘనుడయ్యుబ్రోవడో యా
జనుడే జీవన్మృతుండు జగతి కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లిదండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బతికి యున్ననూ చచ్చినవాడితో సమానం అగును.

కుమార శతకం (Kumara Shatakam) - 26

కుమార శతకం (Kumara Shatakam) - 26

సరివారిలోన నేర్పున
దిరిగెడు వారలకుగాక తెరవాటులలో
నరయుచు మెలగెడి వారికి
బరువేటికి గీడె యనుభవంబు కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము, కీర్తి లభించును. అంతేకాక దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేసినయెడల గౌరవము చెడి కీడు జరుగును.

కుమార శతకం (Kumara Shatakam) - 25

కుమార శతకం (Kumara Shatakam) - 25

వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమార! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.

కుమార శతకం (Kumara Shatakam) - 24

కుమార శతకం (Kumara Shatakam) - 24

పురుషుండొనర్పని  పనికిని
నరయగ దైవం బదెట్టు లనుకూలించున్
సరణిగ విత్తకయున్నను
వరిపండునె ధరణిలోన వరలి కుమారా !


తాత్పర్యము:-
విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందా? అలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడు? కాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము. 

కుమార శతకం (Kumara Shatakam) - 23

కుమార శతకం (Kumara Shatakam) - 23

అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం
స్తవనీయు, దేవశృతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !


భావము :-
ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని, విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు.

కుమార శతకం (Kumara Shatakam) - 22

కుమార శతకం (Kumara Shatakam) - 22

తనజులనుం గురువృద్ధుల
జననీజనకులను సాధుజనుల నెవడు దా
ఘనుడయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !


భావము :-
ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, సజ్జనులైనవారిని,   ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును.