Tuesday, August 27, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 19

కుమార శతకం (Kumara Shatakam) - 19

చేయకుము కాని కార్యము;
పాయకుము మఱిన్ శుభం; బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబునఁ ;
గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! సాధ్యము కాని పనిని చేయుటకు ప్రయత్నించవద్దు, మంచిదానిని వదలవద్దు. పగవాని యింట భుజించవద్దు. ఇతరులకు నొప్పికలుగునట్లు మాట్లాడవద్దు.

No comments:

Post a Comment