Tuesday, August 27, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 18

కుమార శతకం (Kumara Shatakam) - 18

పిన్నల పెద్దలయెడఁ గడు
మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ
వెన్నుకొని తిరుగుచుండిన
నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!


తాత్పర్యం:-
ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు.

No comments:

Post a Comment