Tuesday, August 27, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 20

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 20

జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్
దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం
దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా
తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
దయకు సముద్రము వంటివాడా! దశరథమహారాజ కుమారా! శ్రీరామా! కొలనులో నీరు ఇంకిపోయిన తరువాత అందులో బురద మాత్రమే మిగులుతుంది. ఆ బురదలో చిక్కిన చేపపిల్ల అక్కడ నుంచి కదలలేకపోతుంది. అప్పుడు అది నీరు కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా మానవులు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత వారికి నువ్వు గుర్తు వస్తావు. అప్పుడు నీ మీద మనసు లగ్నం చేస్తారు. అలా చేసినప్పటికీ వారిని నువ్వు తప్పక అనుగ్రహిస్తావు.

No comments:

Post a Comment