దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 19
రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా
రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో
ద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
తాత్పర్యం:-
ఘోరపాపాల నుండి విముక్తిని కలిగించేవాడు, సద్గుణములతో కూడిన కల్పవృక్షం వంటివాడు, తీగెలెన్నో విచ్చుకొనే తోట వంటివాడు, ఆరు రకాల వికారాలను జయించిన వాడు, సాధుపుంగవులను రక్షించడమే వ్రతంగా గలవాడు.. ఎవరంటే రాముడే. పరమదైవమూ ఆయనే కదా. నీ అడుగులలో పూచే తామరలనూ కొలవడమే నా పని భద్రగిరి వాసా!

No comments:
Post a Comment