Wednesday, August 21, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 12

కుమార శతకం (Kumara Shatakam) - 12

పుడమిని దుష్టత గలయా
తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ
నడవడి మిడి యందఱి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!


తాత్పర్యం:-
ఓ కుమారా! చెడ్డనడవడి కలవాడు దుడుకుతనముచే లంచములను తీసికొనుటకు ఉద్దేశించును. కాబట్టి దుష్టబుద్ధిగల వాడవై లోకులందరనూ మర్యాదనతిక్రమించి వెంటతిప్పుకొనుచూ హాని చేయవద్దు.

No comments:

Post a Comment