వేమన శతకం (Vemana Shatakam) - 43
తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన
మానవుండు ముక్తి మానియుండు
ధర్మమునె పలికిన దైవంబు తోడగు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
న్యాయం చెప్పమని మన దగ్గరకు వచ్చిన వాళ్ళ తగువులు తీర్చే సమయములో ధర్మం తప్పి ప్రవర్తించరాదు. అలా చేసిన వాళ్ళకు ముక్తి ఉండదు. ధర్మం పలికిన వాళ్ళకు దైవం కూడ తోడుగా ఉంటాడు.

No comments:
Post a Comment