Saturday, August 3, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 8

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 8

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ


భావం:-
కరుణకు నెలవైన దశరథ కుమారా! ఓ శ్రీరామా! యుద్ధంలో శత్రువులకు నీ రూపంతో భయం కలిగించినవాడివి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే చుట్టానివి. బాణాలు, అమ్ములపొదులు కలిగినవాడివి. విలువిద్య అనే గొప్పదైన కళలో కీర్తికలవాడివి. అటువంటి నీకు సాటిరాగల వేరొక దైవం లేడు. నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగును ఎక్కి, భేరిక వంటి చర్మవాద్యాల మీద నుంచి వచ్చే ‘ఢాం ఢాం’ ధ్వనులతో మార్మోగిపోయేట్లుగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేసేలా ప్రకటిస్తాను.

No comments:

Post a Comment