కృష్ణ శతకం (Krishna Shathakam) - 11
దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చికొనియు నయోధ్య
న్విశదముగ కీర్తి నేలితి
దశరథరామావతార ధన్యుడ కృష్ణా!
భావం:-
ఓ కృష్ణా! నువ్వు దశరథునికి కుమారుడిగా జన్మించావు. రామావతారం ఎత్తావు. పది తలల రావణుని చంపావు. సీతాదేవితో క్షేమంగా అయోధ్యానగరానికి వ చ్చావు. మంచి పేరుప్రఖ్యాతులు వచ్చేలా రాజ్యాన్ని పరిపాలించావు.
ప్రతిపదార్థం:-
దశరథరామ + అవతార అంటే దశరథ మహారాజుకి పుట్టి రాముడిగా ప్రసిద్ధుడైనవాడా; ధన్యుడ అంటే ధన్యమైన జీవితం కలవాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; దశకంఠుని అంటే పదితలలు గల రావణుడిని; పరిమార్చియు అంటే చంపి; కుశలముతో అంటే క్షేమముగా; సీతన్ అంటే నీ భార్య అయిన జానకీదేవిని; తెచ్చుకొనియు అంటే లంక నుంచి తీసుకొనివచ్చి; అయోధ్యన్ అంటే అయోధ్యానగరాన్ని; విశదముగ అంటే గొప్పదైన; కీర్తిన్ అంటే ఖ్యాతితో; ఏలితి అంటే పరిపాలించావు.
విష్ణుమూర్తి అవతారాలలో రామావతారం చాలా గొప్పది. తండ్రిమాటను జవదాటని వాడు రాముడు. నిజమే తప్ప అబద్ధం పలకడం తెలియని వాడు రాముడు. తండ్రి అయిన దశరథుడు కైకకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అడవికి వెళ్లినవాడు రాముడు. రాముడంటే... ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య...గా ప్రసిద్ధికెక్కాడు. అందుకే రాముడిని ‘లంకేశుని వైరి వంటి రాజు’ అన్నారు. కవి ఈ పద్యంలో రామావతారాన్ని వర్ణించాడు.

No comments:
Post a Comment