Saturday, August 24, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 16

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 16

పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం
తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ


భావం:-
అయోధ్యను పాలించే దశరథమహారాజు కుమారుడైన శ్రీరామా, కరుణకు మారుపేరయినావాడా, రామా! పాపం చేసినప్పుడు, పాపం వలన భయం కలిగినప్పుడు, బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరం వంటి రోగాలతో బాధ పడుతున్నప్పుడు, ఆపదలు కలిగిన సమయంలోనూ... నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నువ్వు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలసి వచ్చి, కష్టాలలో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి, ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment