Saturday, August 24, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 18

కృష్ణ శతకం (Krishna Shathakam) - 18

హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజ నాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!


భావం:-
ఓ శ్రీకృష్ణా! ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలను కలిపి పలికినంత మాత్రానే అంతవరకు చేసిన పాపాలనన్నిటినీ హరిస్తావు. ఓ శ్రీకృష్ణా! నీ పేరులో ఉన్న గొప్పతనాన్ని వర్ణించి చెప్పటం ఎవ్వరితరమూ కాదు కదా!

హరి అనే రెండు అక్షరాలను స్మరించిన ప్రహ్లాదుడు కష్టాలను అధిగమించాడు. శ్రీహరిని ధ్యానించిన గజేంద్రుడు మోక్షం పొందాడు. శ్రీహరికై తపస్సు చేసిన ధ్రువుడు ఆకాశంలో నక్షత్రరూపంలో శాశ్వత స్థానాన్ని పొందాడు. ఇంకా ఎందరో భక్తులు ఆ హరిని ప్రార్థించి మహనీయులు అయ్యారు. హరి అనే రెండు అక్షరాల పదానికి ఇంత మహాత్మ్యం ఉందని కవి ఈ పద్యంలో వివరించాడు.

No comments:

Post a Comment