Thursday, August 22, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 14

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 14

పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:-
దయాగుణం కలిగిన ఓ దశరథరామా! మమ్మల్ని పెంచి పోషించటానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలను పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే పది ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుని రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయ చూపటానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు.

No comments:

Post a Comment