వేమన శతకం (Vemana Shatakam) - 52
నిజము తెలిసియున్న సుజనుడా నిజమునె
పలుకవలయుగాని పరులకొఱకు
దాపగూడ దింక నోప దన్యము పల్క
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
నిజము తెలిసి ఉన్నప్పుడు మంచి వాడు ఆ నిజమునే మాట్లాడాలిగాని పరుల కోసం దాచి పెట్టకూడదు. ఎంత బ్రతిమిలాడినను ఒకరికోసం తను నిజం మాట్లాడడము అనే అలవాటు తప్పకూడదు.

No comments:
Post a Comment