దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 13
జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్
జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే
తర్రుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ
భావం:-
దయాగుణం కలిగిన దశరథరామా! నీ గురించిన కథలు అమృతంలా ఉంటాయి. ఆ అమృతాన్ని తాగుతాను. కమలాల వంటి నీ పాదాల నుంచి పుట్టిన తీర్థజలాన్ని నోరారా జుర్రుతాను. ‘రామా’ అనే మాటను పలకడం వలన కలిగిన సుధారసాన్ని ఎంతో ఇష్టంతో ఆరగిస్తాను. నన్ను నీచులైన మనుష్యులతో స్నేహం చేయకుండా కాపాడు. జాలిగుణం కలిగిన నిన్ను, నీ పాదాలను సేవించే రుచులను పొందే వారి స్నేహాన్ని కలగచేయి.

No comments:
Post a Comment