సుమతీ శతకం (Sumathi Shathakam) - 23
పాలను గలిసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
బాల చవి జెఱచు గావున
బాలసుడగు వాని పొందు వలదుర సుమతీ!
భావం:-
పాలలో కలిసిన నీళ్లు కూడా చూడటానికి పాలలాగానే తెల్లగా ఉంటాయి. కాని ఆ నీరు పాలలో కలిసినందువల్ల పాలకు ఉండే సహజమైన రుచి పోతుంది. దుర్మార్గుడు చూడటానికి మంచివానిగా, వివేకం కలవానిగా కనిపిస్తాడు. కాని మంచివానిలో ఉండే సజ్జన గుణాన్ని పోగొడతాడు. కనుక చెడ్డవానితో స్నేహం ఎంత మాత్రం పనికిరాదు.
ప్రతిపదార్థం:-
పాలను అంటే తెల్లని రంగులో ఉండే పాలతో. కలిసిన అంటే కలిసినటువంటి. జలమును అంటే నీరు కూడా. పరికింపన్ + కాన్ అంటే చూడటానికి. పాలవిధంబునన్ + ఎ అంటే తెల్లని పాలలాగానే. ఉండున్ అంటే ఉంటాయి. పాలచవిన్ అంటే పాలకు ఉండే సహజమైన రుచిని. చెరచున్ అంటే పాడుచేస్తాయి. కూడా. కావునన్ అంటే అందువలన. పాలసుడు + అగువాని అంటే దుర్మార్గుడు అయిన వానితో. పొందు అంటే స్నేహం. వలదుర అంటే వద్దయ్యా. పాలల్లో నీళ్లు కలవటం వల్ల నీళ్లకు పాల రంగు వస్తుంది. కాని ఆ నీళ్లు పాల రుచిని చెడగొడతాయి. అంటే ఎంతో స్వచ్ఛమైన పాలు నీటి కలయిక వల్ల ఆ స్వచ్ఛతను కోల్పోతాయి. అదేవిధ ంగా చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల మంచివాడు తప్పనిసరిగా చెడిపోతాడు. సిరి అబ్బకపోయినా, చీడ అబ్బుతుందనే మాట లోకంలో ప్రసిద్ధిగా ఉంది. అందువల్లే దుష్టునికి దూరంగా ఉండమని కవి ఈ పద్యంలో వివరించాడు.

No comments:
Post a Comment