Tuesday, August 13, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 12

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 12

చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్
పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా
మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్
దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:-
దయాగుణం కలిగిన దశరథరామా! జ్ఞానం లేని వారు తియ్యగా ఉండే పంచదారను వదిలి, చేదుగా ఉండే వేప ఆకును తింటారు. ఆ విధంగా కొందరు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేక, చిల్లరదేవుళ్లను కొలుస్తున్నారు. ఇది మంచిది కాదు. అందరూ మొక్కదగినవాడవు నువ్వే. మోక్షమిచ్చేవాడివి కూడా నువ్వే. ఇంక ఇతరమైన మాటలు మాట్లాడటం అనవసరం.

No comments:

Post a Comment