వేమన శతకం (Vemana Shatakam) - 579
పాలప్రియముచేత బరగ నేడ్చెడిబిడ్డ
క్షుత్తు తప్పుట కిల శోకపడగ
తల్లి పనులు తీర్చి తనయుని ముద్దాడు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
బిడ్డ పాలకోసం యేడుస్తున్నప్పుడు, తల్లి తన పనులన్ని త్వరగా ముగించుకోచ్చి ముద్దాడి పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఆ ఏడ్చే బిడ్డ ఆకలి తల్లె తీర్చగలదు. అందుకే తల్లిని మించిన దైవం లేదు.

No comments:
Post a Comment