Monday, October 21, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 580

వేమన శతకం (Vemana Shatakam) - 580

పరధనంబులకును ప్రాణములిచ్చును
సత్యమింతలేక జారుడగును
ద్విజులమంచు నెంత్రుతేజ మించుకలేదు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పరులధనం కోసం ఎంత పనైనా చేస్తారు. అబద్దాలతో తిరుగుతూ ఉంటారు. అసలు నిజము పలుకరు. తేజస్సు ఏమి లేకున్నా తామే గొప్ప వాళ్ళమని భావిస్తూ ఉంటారు.

No comments:

Post a Comment