Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 577

వేమన శతకం (Vemana Shatakam) - 577

తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమమగును
పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తొందరపడి ఎటువంటి పని చేయకూడదు.తొందరపాటు వలన చేసే పని సఫలం కాకపోగా సర్వనాశనమవుతుంది. దోరగా ఉన్న పండుని తీసుకొచ్చి పండబెడితే పండుతుంది కాని, లేత పచ్చి కాయని పండబెడితే కుళ్ళిపోతుంది కాని పండదు.

No comments:

Post a Comment