Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 576

వేమన శతకం (Vemana Shatakam) - 576

తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చు నని గడింత్రు
కాని యెల్ల యెడల ఘన దుఖకరమది
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తల్లి బిడ్డల మద్య తగువులు పుట్టించగలిగినంత ప్రమాదకరమైనది ధనము. దాని వల్ల ఎంతో సుఖం కలుగుతుందని సంపాదిస్తారు కాని చివరకు అది ఎప్పుడూ దఃఖానికి కారణమవుతుంది.

No comments:

Post a Comment